వరంగల్: కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు సాధించింది. ఐఆర్ఎఫ్-2026 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్‌లో కేఎంసీకి జాతీయ స్థాయిలో 60వ ర్యాంకు దక్కింది.
టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్, పెడగాజీ విభాగాల్లో ప్రతిభ చూపి కళాశాల 870 స్కోరు సాధించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి గాంధీ, ఉస్మానియా, రిమ్స్ ఆదిలాబాద్‌తో పాటు కేఎంసీకి ఈ ర్యాంకింగ్స్‌లో స్థానం లభించడం విశేషమని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా అందించే అత్యుత్తమ బోధనా విధానాలకు గానూ ఈ జాతీయ గుర్తింపు లభించినట్లు వెల్లడించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


