HomeLatest Newsరేపు కొండా సురేఖ నివాసంలో కీలక సమావేశం: అనంతరం ఢిల్లీకి పయనం

రేపు కొండా సురేఖ నివాసంలో కీలక సమావేశం: అనంతరం ఢిల్లీకి పయనం

Published on

spot_img

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రేపు ఉదయం 9 గంటలకు రామ్‌నగర్‌లోని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ నివాసంలో ముఖ్య కార్యకర్తలతో అత్యవసర సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పాల్గొననున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కొండా మురళి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి తప్పక హాజరుకావాలని సమాచారం అందించారు. కొండా సురేఖకు అధిష్ఠానం ఒక ముఖ్యమైన పదవిని కేటాయించబోతోందని, ఈ విషయమై చర్చించేందుకే కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మురళి వర్గీయులకు తెలిపినట్లు సమాచారం.

ప్రస్తుతం కొండా మురళి రామ్‌నగర్ నివాసానికి చేరుకోగా, హైదరాబాదులో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఓఎస్డీ తండ్రిని పరామర్శించిన కొండా సురేఖ వరంగల్‌కు బయలుదేరారు. రేపు ఉదయం కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలను, వారి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం కొండా సురేఖ నేరుగా ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలను కలిసి నియోజకవర్గ నిర్ణయాన్ని వివరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.