వరంగల్: పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు. ఆయన రూపకల్పన చేసిన వినూత్న ‘ఎయిర్ ఫిల్ట్రేషన్ పరికరం’ డిజైన్‌కు భారత ప్రభుత్వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ కార్యాలయం అధికారికంగా డిజైన్ పేటెంట్‌ను (నంబర్: 509018-001) మంజూరు చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
డా. జితేందర్ భౌతికశాస్త్రంలో చేస్తున్న పరిశోధనల్లో భాగంగా మలేసియాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం, అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ భాగస్వామ్యంతో సంయుక్తంగా ఈ ఘనత సాధించారు.
ముఖ్య విశేషాలు:
పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి శుద్ధీకరణ మరియు పర్యావరణ పరిరక్షణకు ఈ కొత్త డిజైన్ ఎంతగానో ఉపయోగపడనుంది.
డా. జితేందర్ సాధించిన ఈ విజయం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ రకమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపులు కళాశాలలో పరిశోధనా వాతావరణాన్ని, విద్యార్థులలో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని మరింత పెంపొందిస్తాయని సహచర అధ్యాపకులు పేర్కొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


