వరంగల్లో శాంతిభద్రతలకు సవాల్.. వరుస దాడులతో ఉలిక్కిపడిన నగరం:
గ్రేటర్ వరంగల్ పరిధిలో రౌడీలు, గుండాలు, భూకబ్జాదారులు పేట్రేగిపోతున్నారు. వీరి వల్ల సామాన్య ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కొందరి అండదండలు రౌడీలకు భూకబ్జాదారులకు ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో జరిగిన రెండు ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ఏనుమాముల మార్కెట్ పరిధిలో రౌడీ షీటర్ పత్తి కుమార్ కాంగ్రెస్ కార్యకర్త అడుప మహేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆయన 80 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతు కొందిసేపటి క్రితం మృతి చెందారు అని సమాచారం. మరో ఘటనలో హనుమకొండ బాలసముద్రంలోని శ్రీనివాస కాలనీలో ప్రభుత్వ భూములను ఆక్రమించే ఒక కుటుంబం మరో వ్యక్తిపై అత్యంత భయానక పరిస్థితుల్లో కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారు.

ఆ ఘటన సిసి ఫుటేజీలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 15 రోజుల క్రితమే ఆ వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికిని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు నేరుగా ఈ దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సమాజానికి చీడపురుగుల తయారైన ఇటువంటి వ్యక్తుల పట్ల పోలీసులు మెతక వైఖరి ప్రదర్శించడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన పోలీస్ కమిషనర్ గా వచ్చిన శ్వేతా రెడ్డి ఇప్పటికైనా శాంతిభద్రతలు గాడితపడం పై దృష్టి సారించాలని నగరంలోని ప్రముఖులు సూచిస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


