మ్యాట్రిమోనీ సైట్లు జీవిత భాగస్వామిని వెతుక్కునే వేదికలే కావచ్చు, కానీ కొందరికి మాత్రం అవి ‘వసూల్ రాజా’ అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే దానికి నిదర్శనం.
వర్థన్నపేటకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా భూపాలపల్లికి చెందిన ఒక మహిళ పరిచయమైంది. “నిన్నే పెళ్లి చేసుకుంటాను” అంటూ ఆమె వేసిన మాయాలోకపు మాటల్లో ఆయన పూర్తిగా మునిగిపోయారు.
కేవలం మాటలతోనే ఆపకుండా, రకరకాల కారణాలు చెప్పి విడతల వారీగా దాదాపు రూ. 20.50 లక్షలను ఆమె వసూలు చేసింది. అంతేకాదు, ఒక ఇంటిని కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది.
డబ్బులు, ఆస్తి అన్నీ చేతికి వచ్చాక అసలు రంగు బయటపడింది. ఆమెకు ఇదివరకే వివాహం జరిగిందని, 15 ఏళ్ల కూతురు కూడా ఉందని తెలుసుకున్న బాధితుడు షాక్కు గురయ్యారు. మోసపోయానని గ్రహించి ఆలస్యంగా భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించారు.
గుర్తించాలి.