వరంగల్ మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది.
డాక్టర్స్ కాలనీలో ఓ మహిళ మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


