వరంగల్: నగరంలోని శాఖరాశి కుంట ప్రాంతంలో మిల్స్ కాలనీ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి ఉత్పత్తులు పట్టుబడ్డాయి. అక్రమంగా గంజాయి, గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన వివరాలు
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాఖరాశి కుంట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద నుండి 250 గ్రాముల గంజాయితో పాటు, యువతను లష్యంగా చేసుకుని విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన 139 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు మరియు వినియోగంపై కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


