వరంగల్: నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి దేవస్థానాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) నాయిని రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే శాకంబరీ నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముక్కోటి దేవతల స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు వరంగల్ ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరిస్తారని, ఈ వేడుకలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ప్రధాన అర్చకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

