HomePoliticsతెలంగాణ రైల్వే సమస్యలపై లోక్‌సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

తెలంగాణ రైల్వే సమస్యలపై లోక్‌సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

న్యూఢిల్లీ | తేది: 16-03-2026

తెలంగాణ రాష్ట్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గళమెత్తారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై జరిగిన చర్చలో పాల్గొని తెలంగాణకు సంబంధించిన పలు కీలక సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఔషధ మరియు పారిశ్రామిక రంగాల్లో వేగంగా ఎదుగుతున్నప్పటికీ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు అదే స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఎంపీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు.

ప్రత్యేకంగా దేశంలోనే అత్యంత రద్దీగా మారిన కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.

కాజీపేటలో ప్రతిపాదిత రైల్ అండర్ బ్రిడ్జ్ మరియు రైల్ టన్నెల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను తక్షణమే ప్రారంభించి, అందులో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంపీ స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు అమలు అయితే వరంగల్ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.

పరిపాలనా సౌలభ్యం కోసం కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే జోన్ లేదా బలమైన సబ్ జోన్ ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ కేంద్రాన్ని కోరారు.

అలాగే హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్వే కారిడార్లకు స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించి పనులు వేగవంతం చేయాలని సూచించారు.

తెలంగాణలో వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు ట్రాక్ విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.