HomeWarangal Newsకాజిపేట్ : ఖో-ఖో సమరానికి ముస్తాబైన రైల్వే స్టేడియం

కాజిపేట్ : ఖో-ఖో సమరానికి ముస్తాబైన రైల్వే స్టేడియం

Published on

spot_img

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 58వ సీనియర్ నేషనల్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ (2025-26) నిర్వహణకు వరంగల్‌లోని కాజీపేట రైల్వే స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ జాతీయ స్థాయి క్రీడా సంబరం జరగనుంది.

పోటీల కోసం స్టేడియంలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా కోర్ట్ మార్కింగ్ చేయడంతో పాటు, రాత్రి వేళల్లో కూడా మ్యాచ్‌లు సాఫీగా సాగేలా భారీ ఫ్లడ్ లైట్లను అమర్చారు. స్టేడియం ప్రాంగణమంతా ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 1,976 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. ఇప్పటికే కేరళ, అస్సాం, గోవా వంటి రాష్ట్రాల జట్లు కాజీపేటకు చేరుకున్నాయి.

వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక పాఠశాలలు, కళాశాలలు మరియు లాడ్జీలలో బస ఏర్పాట్లు చేశారు. వారందరికీ నాణ్యమైన భోజన వసతి కల్పించేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలు వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles