HomeWarangal Newsవరంగల్‌లో NEET PG పరీక్ష.. కీలక ఆంక్షలు.. ఇవి తప్పక తెలుసుకోండి!

వరంగల్‌లో NEET PG పరీక్ష.. కీలక ఆంక్షలు.. ఇవి తప్పక తెలుసుకోండి!

Published on

spot_img

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 30న నిర్వహించనున్న NEET (PG)-2026 పరీక్షలకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు :

పరీక్ష జరిగే రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)-2023లోని సెక్షన్ 163 అమల్లో ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడరాదని సూచించారు. ఈ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మైకులు, డీజేలు వినియోగించడాన్ని నిషేధించినట్లు తెలిపారు.

ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాలు మూసివేత :

పరీక్ష సమయం వరకు కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్ :

పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీస్ పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. అనుమానాస్పద పరిస్థితులపై నిఘా ఉంచి సమాచారం సేకరించేలా ఏర్పాట్లు చేశారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles