వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఫోర్జరీ ఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ పొందేందుకు గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని మరియు రబ్బరు స్టాంపులను ఫోర్జరీ చేశాడు. ఆస్తి యజమాన్య ధృవీకరణ పత్రంపై నకిలీ సంతకం పెట్టి ఫైనాన్స్ వారికి సమర్పించాడు.
ఈ నెల 9న సదరు ఫైనాన్స్ ప్రతినిధులు వెరిఫికేషన్ కోసం సీ కే తండా పంచాయతీ సెక్రటరీ మాలతిని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆ సర్టిఫికేట్ తాను జారీ చేయలేదని, తన వద్ద ఉన్న రబ్బరు స్టాంపులు ఇంగ్లీష్‌లో ఉంటే, ఫోర్జరీ పత్రంపై తెలుగులో ఉన్నాయని ఆమె గుర్తించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సెక్రటరీ తెలిపారు.


