వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ బదిలీలు చేపట్టారు. ఈ మేరకు విడుదలైన ఉత్తర్వుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి కొత్త పోస్టింగ్‌లకు ఎస్‌ఐలను కేటాయించారు.
బదిలీ అయిన ఎస్‌ఐలు, కొత్త పోస్టింగ్‌ల వివరాలు:
- పి. తిరుపతి – ఆత్మకూరు నుంచి కొడకండ్ల పోలీస్ స్టేషన్‌కు.
- ఎన్. చెన్న కేశవులు – జనగామ నుంచి తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌కు.
- ఎం. రమేష్ – సీసీఆర్‌బీ నుంచి పీసీఆర్, వరంగల్‌కు.
- కె. హరికృష్ణ – పీసీఆర్ నుంచి సీసీఆర్‌బీ, వరంగల్‌కు.
- ఎ. కల్యాణ్ కుమార్ – కేయూసీ నుంచి సీటీసీ, వరంగల్‌కు.
- టి. శ్రావణి – మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు.
- నైనాల నాగభూషణం @ నాగేష్ – సీసీఎస్ నుంచి హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు.
- చి. రవి కుమార్ – వీఆర్ నుంచి జనగామ పోలీస్ స్టేషన్‌కు.
- ఎండీ. ఫసియుద్దీన్ – హనుమకొండ ట్రాఫిక్ నుంచి సీసీఎస్, వరంగల్‌కు.
- డి.వి. ఫణి – సుబేదారి నుంచి హనుమకొండ ట్రాఫిక్‌కు.
- డి. సంబయ్య – మట్వాడ నుంచి కేయూసీ పోలీస్ స్టేషన్‌కు.
- ఎం. శంకర్ – పీసీఆర్ నుంచి మడికొండ పోలీస్ స్టేషన్‌కు.
- ఎం. కుమారస్వామి – పీసీఆర్ నుంచి ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు.
- టి. కృష్ణమూర్తి – పీసీఆర్ నుంచి సీబీ, వరంగల్‌కు.
- జి. రామకృష్ణ చారి – పీసీఆర్ నుంచి నర్సంపేట పోలీస్ స్టేషన్‌కు.
సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు బదిలీ ఉత్తర్వుల ప్రకారం వెంటనే చర్యలు తీసుకుని, బదిలీ అయిన అధికారులను కొత్త పోస్టింగ్‌లలో రిపోర్ట్ చేయించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.


