HomeWarangal Newsసైబర్ నేరాలపై వరంగల్ పోలీసుల ఫుల్ ఫోకస్.. సీపీ శ్వేత కీలక ఆదేశాలు..!

సైబర్ నేరాలపై వరంగల్ పోలీసుల ఫుల్ ఫోకస్.. సీపీ శ్వేత కీలక ఆదేశాలు..!

Published on

spot_img

వరంగల్: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) కళాశాలలో నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆమె పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి:

కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి, నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. నిందితుల అరెస్టులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. అలాగే చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే బాధితులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి:

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిర్వహణ వంటి కీలక అంశాలపై సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో గుట్కా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలి:

ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి, నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. డయల్-100 ద్వారా వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో సహాయం అందించాలని సూచించారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్3
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్3

భూ వివాదాల్లో ఎస్‌ఓపీ అమలు తప్పనిసరి:

భూ వివాదాలకు సంబంధించిన కేసుల్లో ప్రామాణిక విధానాలు (ఎస్‌ఓపీ) కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్2
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్2

బాధితులకు 352 సెల్‌ఫోన్ల పంపిణీ:

సమీక్ష సమావేశం అనంతరం సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 మొబైల్ ఫోన్లను కమిషనర్ ఎన్. శ్వేత బాధితులకు అందజేశారు. సెల్‌ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు:

ఈ నెలవారీ నేర సమీక్ష సమావేశంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు, వివిధ ప్రత్యేక విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles