HomeWarangal Newsవరంగల్ పోలీస్ విభాగంలో కీలక మార్పులు..8మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..!

వరంగల్ పోలీస్ విభాగంలో కీలక మార్పులు..8మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..!

Published on

spot_img

వరంగల్ పోలీస్ విభాగంలో కీలక మార్పులు..8మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు మరియు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్ (వేటింగ్ రిజర్వ్)లో విధులు నిర్వహిస్తున్న అధికారులను వివిధ విభాగాల్లో నియమిస్తూ ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

ఉత్తర్వుల ప్రకారం ఇన్‌స్పెక్టర్ కె. ప్రవీణ్ కుమార్‌ను ట్రాఫిక్ విభాగానికి నియమించారు. సుబ్బారెడ్డికి టాస్క్ ఫోర్స్‌లో బాధ్యతలు అప్పగించగా, దేవేందర్‌ను కూడా టాస్క్ ఫోర్స్ విభాగంలో నియమించారు. అదేవిధంగా దామోదర్ రెడ్డికి ప్రత్యేక విభాగంలో పోస్టింగ్ ఇవ్వగా, చేరాలు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహించనున్నారు. ఓ. రమేష్‌కు మరో కీలక విభాగంలో బాధ్యతలు అప్పగించగా, ఆర్. ప్రవీణ్ కుమార్‌కు ప్రత్యేక విభాగంతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు. మిగతా అధికారులకు కూడా శాఖ అవసరాలకు అనుగుణంగా పోస్టింగ్‌లు ఇచ్చినట్లు సమాచారం.

ఈ బదిలీల ద్వారా వివిధ విభాగాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు అందించే పోలీస్ సేవలు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.