వరంగల్:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ డ్యూటీ మీట్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ జాగిలాలకు (డాగ్ స్క్వాడ్) ప్రత్యేక పోటీలను నిర్వహించారు. నేర పరిశోధనలో అత్యంత కీలకమైన నిందితులను గుర్తించడంలో జాగిలాలు ప్రదర్శించే ప్రతిభ, వాటి సామర్థ్యం ఆధారంగానే విజేతలను నిర్ణయిస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఈ పోటీలలో అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో ఎక్కువ మంది నిందితులను తక్కువ సమయంలో గుర్తించిన జాగిలానికి ప్రత్యేక బహుమతిని అందజేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్రమశిక్షణతో, చురుగ్గా సాగిన ఈ డాగ్ స్క్వాడ్ విన్యాసాలు అక్కడికి వచ్చిన వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.


