HomeWarangal Newsవరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాన్స్‌ఫర్లు.. పూర్తి లిస్ట్ ఇదే!

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రాన్స్‌ఫర్లు.. పూర్తి లిస్ట్ ఇదే!

Published on

spot_img

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, ఖాళీల భర్తీ తదితర అంశాల ఆధారంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌కు శ్రీనివాస్ :

వీఆర్‌ వరంగల్‌లో పనిచేస్తున్న ఎస్.శ్రీనివాస్‌ను స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అక్కడి ఎస్‌హెచ్‌ఓగా ఉన్న జి.వేణును రఘునాథపల్లి సీఐగా బదిలీ చేశారు. రఘునాథపల్లి సీఐగా ఉన్న ఏ.శ్రీనివాస్‌ను ఖాళీగా ఉన్న సీఎస్‌బీ, వరంగల్‌కు పంపారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.దేవేందర్‌కు నర్మెట్ట సర్కిల్ సీఐ బాధ్యతలు అప్పగించారు.

పలువురికి కీలక పోస్టింగులు:

సీపీటీసీలో పనిచేస్తున్న టి.రవి కుమార్‌ను డబ్ల్యూపీఎస్‌-II (వరంగల్, జనగాం) ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఏ.సువర్ణను సీఎస్‌ఎస్‌, వరంగల్‌కు బదిలీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పి.మార్గిలాల్‌కు టాస్క్‌ఫోర్స్ బాధ్యతలతో పాటు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అటాచ్మెంట్ ఇచ్చారు. బరత్ సుమన్‌ను పాలకుర్తి సర్కిల్ సీఐగా నియమించగా, వి.జానకి రామ్ రెడ్డిని సీఎస్‌బీ, వరంగల్‌కు బదిలీ చేశారు.

మరికొందరికి కొత్త బాధ్యతలు:

పరకాల ఎస్‌హెచ్‌ఓగా ఉన్న వి.క్రాంతి కుమార్‌ను టాస్క్‌ఫోర్స్‌కు పంపారు. టాస్క్‌ఫోర్స్‌లోని జి.బాబూలాల్‌ను ఆత్మకూర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఆత్మకూర్ ఎస్‌హెచ్‌ఓ ఆర్.సంతోష్‌కు పర్వతగిరి సర్కిల్ సీఐ బాధ్యతలు అప్పగించారు. పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్‌ను టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు.

ఎల్కతుర్తి సీఐ పి.రమేష్‌కు హనుమకొండ డబ్ల్యూపీఎస్‌-I ఎస్‌హెచ్‌ఓగా పోస్టింగ్ ఇచ్చారు. వార్ధన్నపేట సీఐ వై.సంజీవరావును మరోచోటికి, కే.శ్రీనివాసరావును సీఎస్‌ఆర్‌బీ, వరంగల్‌కు బదిలీ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

ఇన్‌స్పెక్టర్ల బదిలీలు – ఎక్కడి నుంచి.. ఎక్కడికి?

  1. ఎస్‌. శ్రీనివాస్ – వీఆర్‌, వరంగల్‌ → స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎస్‌హెచ్‌ఓ
  2. జి. వేణు – స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎస్‌హెచ్‌ఓ → రఘునాథపల్లి సీఐ
  3. ఎ. శ్రీనివాస్ – రఘునాథపల్లి సీఐ → సీఎస్‌బీ, వరంగల్‌
  4. పి. దేవేందర్‌ – టాస్క్‌ఫోర్స్‌, వరంగల్‌ → నర్మెట్ట సీఐ
  5. టి. రవికుమార్‌ – సీపీటీసీ, వరంగల్‌ → డబ్ల్యూపీఎస్‌-2 (వరంగల్‌–జనగామ) ఎస్‌హెచ్‌ఓ
  6. ఎ. సువర్ణ – డబ్ల్యూపీఎస్‌-2 (వరంగల్‌–జనగామ) ఎస్‌హెచ్‌ఓ → సీసీఎస్‌, వరంగల్‌
  7. పి. మాంగీలాల్‌ – టాస్క్‌ఫోర్స్‌, వరంగల్‌ → టాస్క్‌ఫోర్స్‌లోనే కొనసాగింపు; మిల్స్‌కాలనీ పీఎస్‌కు అటాచ్‌
  8. భరత్‌ సుమన్‌ – వరంగల్‌ కమిషనరేట్‌కు కేటాయింపు → పాలకుర్తి సీఐ
  9. వి. జానకిరామ్‌రెడ్డి – పాలకుర్తి సీఐ → సీఎస్‌బీ, వరంగల్‌
  10. టి. కిరణ్‌ – వరంగల్‌ కమిషనరేట్‌కు కేటాయింపు → పీసీఆర్‌, వరంగల్‌; ఐటీ కోర్‌ సెల్‌కు అటాచ్‌
  11. ఎ. ప్రవీణ్‌కుమార్‌ – వీఆర్‌, వరంగల్‌; ఐటీ కోర్‌ సెల్‌కు అటాచ్‌ → పరకాల పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ
  12. వి. క్రాంతికుమార్‌ – పరకాల పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ → టాస్క్‌ఫోర్స్‌, వరంగల్‌
  13. అనుముల శ్రీనివాస్‌ – వరంగల్‌ కమిషనరేట్‌కు కేటాయింపు → ధర్మసాగర్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ
  14. జి. బాబులాల్‌ – టాస్క్‌ఫోర్స్‌, వరంగల్‌ → ఆత్మకూరు పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ
  15. ఆర్‌. సంతోష్‌ – ఆత్మకూరు పీఎస్‌ ఎస్‌హెచ్‌ఓ → పర్వతగిరి సీఐ
  16. బి. రాజగోపాల్‌ – పర్వతగిరి సీఐ → టాస్క్‌ఫోర్స్‌, వరంగల్‌
  17. కె. శ్రీను – వీఆర్‌, వరంగల్‌ → ఎల్కతుర్తి సీఐ
  18. పి. రమేష్‌ – ఎల్కతుర్తి సీఐ → డబ్ల్యూపీఎస్‌-1 (హనుమకొండ) ఎస్‌హెచ్‌ఓ
  19. కె. సూర్య ప్రసాద్‌ – డబ్ల్యూపీఎస్‌-1 (హనుమకొండ) ఎస్‌హెచ్‌ఓ → సీటీసీ, వరంగల్‌
  20. కె. సాయి రమణ – వీఆర్‌, వరంగల్‌ → సీఎస్‌బీ, వరంగల్‌; డ్రగ్‌ కంట్రోల్‌ టీమ్‌కు అటాచ్‌
  21. వై. సంజీవరావు – సీసీఆర్‌బీ, వరంగల్‌ → వర్ధన్నపేట సీఐ
  22. కె. శ్రీనివాసరావు – వర్ధన్నపేట సీఐ → సీసీఆర్‌బీ, వరంగల్‌.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.