HomeWarangal Newsవరంగల్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది మంది ఎస్ఐల బదిలీ

వరంగల్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది మంది ఎస్ఐల బదిలీ

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లను (SI) బదిలీ చేస్తూ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా మొత్తం 9 మంది అధికారులకు కొత్త స్థానాలను కేటాయించారు. 

బదిలీ అయిన వారి వివరాలు :

  • వరంగల్ సీసీఎస్‌లో పనిచేస్తున్న సాయి ప్రసన్న కుమార్ నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ (SHO) గా బదిలీ అయ్యారు.

 • నల్లబెల్లి ఎస్హెచ్‌ఓగా ఉన్న వి.గోవర్ధన్ వరంగల్ వీఆర్ (VR) కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

• మడికొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న జి.రామ్ మోహన్ ఖానాపురం ఎస్హెచ్‌ఓగా నియమితులయ్యారు.

 • ఖానాపురం ఎస్హెచ్‌ఓగా ఉన్న చ.రఘుపతిని వీఆర్‌కు బదిలీ చేశారు.

 • ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఇ.నరసింహారావును ఎల్కతుర్తి ఎస్హెచ్‌ఓగా బదిలీ చేశారు.

 • ఎల్కతుర్తి ఎస్హెచ్‌ఓగా ఉంటూ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ అయిన ఎ.ప్రవీణ్ కుమార్ వీఆర్‌కు బదిలీ అయ్యారు.

 • వీఆర్‌లో ఉన్న ఎ.శ్రీకాంత్ బచ్చన్నపేట ఎస్హెచ్‌ఓగా నియమితులయ్యారు.

 • బచ్చన్నపేట ఎస్హెచ్‌ఓగా ఉంటూ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ అయిన ఎస్.కె. హమీద్ వీఆర్‌కు బదిలీ అయ్యారు.

 • వీఆర్‌లో ఉంటూ భరోసా సెంటర్‌కు అటాచ్ అయిన బి.మంగను కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.