వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ పోలీసు వాహనాలకు సంబంధించిన పాత విడిభాగాలను బహిరంగ వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 15వ తేదీ, శుక్రవారం ఉదయం 10:00 గంటలకు కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (MTO) లో ప్రభుత్వ వాహనాలకు సంబందించి పాత వస్తువులను వేలంలో ఉంచుతారు. వీటిలో ప్రధానంగా
పాత బ్యాటరీలు
వాడిన టైర్లు
ఇతర విడిభాగాలు (Spare Parts)
సంప్రదించాల్సిన వివరాలు:
ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
📞 87126 85158
📞 94402 42895
📞 99495 68320
ముఖ్య గమనిక: వేలం నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనేవారు సకాలంలో హాజరుకావాల్సి ఉంటుంది.


