HomeWarangal Newsవరంగల్ గడ్డపై 'రుద్రమ' గర్జన.. భద్రకాళి బండ్ సాక్షిగా నింగిలోకి రాకెట్!

వరంగల్ గడ్డపై ‘రుద్రమ’ గర్జన.. భద్రకాళి బండ్ సాక్షిగా నింగిలోకి రాకెట్!

Published on

spot_img

ఓరుగల్లు నగరం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, యువ శాస్త్రవేత్త భూపతి శశాంక్ నేతృత్వంలో ‘రుద్రమ’ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.

సాధారణంగా రాకెట్ ప్రయోగాలు అనగానే మనకు శ్రీహరికోట గుర్తుకొస్తుంది. కానీ, ఈ నెల 28న (ఫిబ్రవరి 28) వరంగల్‌లోని భద్రకాళి బండ్ వద్ద ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ రాకెట్ సుమారు 3,000 అడుగుల ఎత్తు వరకు దూసుకెళ్తుంది. గమ్యాన్ని చేరుకున్నాక, పారాచూట్ సాయంతో రాకెట్ సురక్షితంగా భూమికి చేరుకునేలా దీనిని రూపొందించారు.

మొదట హయగ్రీవ చారి మైదానంలో ప్రయోగించాలని భావించినప్పటికీ, ప్రజల భద్రత మరియు ఎక్కువ మంది వీక్షించేందుకు వీలుగా వేదికను భద్రకాళి బండ్ వైపు మార్చారు. స్థానిక విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు, సాంకేతికతను సామాన్యులకు చేరువ చేసేందుకు ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలవనుంది. నగరం నడిబొడ్డున జరగనున్న ఈ రాకెట్ లాంచ్‌ను చూసేందుకు వరంగల్ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles