HomeWarangal Newsమొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి తక్షణ సహాయం అందించాలి

మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి తక్షణ సహాయం అందించాలి

Published on

spot_img

న్యూ ఢీల్లీ: వరంగల్ కు మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సహాయం అందించాలి.

అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు విడదల చేయాలి.

GWMC మౌలిక వసతులపై హై లెవల్ ఆడిట్ చేయాలి.

రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి

రోడ్లు–డ్రైనేజ్ పునరుద్ధరణకు ప్రత్యేకంగా 100 కోట్లు మంజూరు చేయాలి.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దే నా ద్యేయం వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

వరంగల్ నగరంలో అక్టోబర్‌లో మెుంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలు.

తుఫాను వల్ల కలిగిన భారీ నష్టంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో జీరో అవర్‌లో గళమెత్తారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో శివనగర్, ఎన్ఎన్‌నగర్, డీకేనగర్ సహా 45 కాలనీలు తీవ్రంగా మునిగిపోయాయని ఎంపీ వివరించారు.

పోతన రోడ్, భద్రకాళి–పాలిటెక్నిక్ రోడ్, ములుగు రోడ్, బొండివాగు, పోచమ్మమైదాన్ 80 అడుగుల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలతో నిండిపోయాయని, కొన్నిచోట్ల రహదారులు నదులుగా మారాయని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.

ఆ సమయంలో ఒక గర్భిణిని ట్రాక్టర్‌లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

భారీ వర్షాల సమయంలో 1,200 మందిని 12 రిలీఫ్ క్యాంపులకు తరలించాల్సి వచ్చిందని ఎంపీ వెల్లడించారు.

AMRUT–స్మార్ట్ సిటీల కింద చేపట్టిన డ్రైనేజీ పనులు 66% మాత్రమే పూర్తికావడంతో ఈ దుర్ఘటన మరింత పెరిగిందన్నారు. ఇది పూర్తిగా ప్రణాళికా వైఫల్యం అని వ్యాఖ్యానించారు.

AMRUT 2.0 కింద ప్రత్యేక నిధులు మార్చి 2026లోగా విడుదల చేయాలని, GWMC మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్ ఆదేశించాలని, రహదారి పునర్నిర్మాణానికి 100 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

హెరిటేజ్, స్మార్ట్ సిటీ అయిన వరంగల్‌ ప్రతి సంవత్సరం వర్షాలతో విధ్వంసం కాకుండా, కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

Latest articles

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

బేకరీలో ఇదేం నిర్వాకం? సోదాల్లో బయటపడ్డ షాకింగ్ దృశ్యాలు!

ఉప్పల్‌లోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT, M-FAST అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ ఊరట.. ఏజ్ లిమిట్ పెంపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.