వరంగల్ ప్రజలకు భారీ ఆరోగ్య కానుక అందబోతోంది. అత్యాధునిక వసతులతో నిర్మించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
ఒకే చోట 35 రకాల వైద్య విభాగాలు (Departments) అందుబాటులో ఉంటాయి. అత్యంత క్లిష్టమైన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు ఇకపై ఇక్కడే లభిస్తాయి.
క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక Linac మెషీన్లతో పాటు రేడియాలజీ సేవలను కూడా సిద్ధం చేస్తున్నారు.
అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ స్థాయి చికిత్సను సామాన్యులకు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే, కేవలం వరంగల్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా మెరుగైన వైద్యం చేరువవుతుంది.


