HomeWarangal Newsవరంగల్ ట్రైసిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. 159 ప్రాంతాల్లో కొత్తగా వీధి దీపాలు!

వరంగల్ ట్రైసిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. 159 ప్రాంతాల్లో కొత్తగా వీధి దీపాలు!

Published on

spot_img

వరంగల్ ట్రైసిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. 159 ప్రాంతాల్లో కొత్తగా వీధి దీపాలు:

వరంగల్: ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సమావేశం నిర్వహించారు.

బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి:

సమావేశంలో ట్రాఫిక్ అధికారులు నగరంలోని తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమైన జంక్షన్లను కూడా గుర్తించారు.

ఆక్రమణలు, పార్కింగ్‌పై చర్చ:

రోడ్లపై ఉన్న ఆక్రమణలు, తొలగించాల్సిన విద్యుత్‌, టెలిఫోన్ స్తంభాలు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులు, యూ-టర్న్ల వద్ద సోలార్ బ్లింకర్ల ఏర్పాటు, ఆటో స్టాండ్లకు అనువైన ప్రాంతాల గుర్తింపు వంటి అంశాలపై అధికారులు చర్చించారు.

159 ప్రాంతాల్లో వీధి దీపాల అవసరం:

శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ట్రైసిటీలో రాత్రివేళ వెలుతురు సరిగా లేని 159 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ పోలీస్, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింరావు, సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles