HomeWarangal Newsవరంగల్‌కు భారీ ఊరట: అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వరంగల్‌కు భారీ ఊరట: అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Published on

spot_img

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) పథకానికి తెలంగాణ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.5,257.20 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (UBS) శాఖ జారీ చేసిన G.O.Rt.No.322 ప్రకారం, వరంగల్ ఫేజ్–Iలో సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మురుగు నీటి పారుదల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మూడు వనరుల ద్వారా సమకూర్చనున్నారు. ఇందులో

• 50 శాతం బాహ్య ఆర్థిక సహాయం (లోన్)

• 25 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ చాలెంజ్ ఫండ్ (UCF) కింద

• 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా

ప్రాజెక్టు అమలుకు సంబంధించి జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ KfW ఆసక్తి చూపినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించిన KfW బృందం సూత్రప్రాయంగా ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. తదుపరి చర్యల కోసం ప్రాథమిక ప్రాజెక్ట్ రిపోర్ట్ (PPR)ను అప్‌లోడ్ చేయాలని సూచించింది.

ఈ ఉత్తర్వులు ఫైనాన్స్ శాఖ అనుమతితో జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ నగరంలో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, నగర పరిశుభ్రత మరియు పర్యావరణ పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles