HomeWarangal Newsహనుమకొండ | అర్బన్ చాలెంజ్ ఫండ్‌లో వరంగల్‌కు రూ.4,674 కోట్లు

హనుమకొండ | అర్బన్ చాలెంజ్ ఫండ్‌లో వరంగల్‌కు రూ.4,674 కోట్లు

spot_img

కేంద్రం మంజూరుతో నగరాభివృద్ధికి భారీ ఊతం

డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ చాలెంజ్ ఫండ్‌ (UCF) కింద వరంగల్ నగరానికి రూ.4,674 కోట్ల భారీ నిధులు మంజూరైనట్లు తెలిపారు.

తెలంగాణకు ఆమోదమైన మూడు ప్రాజెక్టులకు మొత్తం రూ.5,681 కోట్లు కేటాయించగా, అందులో అత్యధిక భాగం వరంగల్‌కే దక్కడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఎంపీ పేర్కొన్నారు.

ఈ నిధులతో వరంగల్ నగరంలో
• డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ
• వరద నివారణ పనులు
• పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి

చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే వరంగల్ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద సమర్థవంతంగా ప్రతిపాదనలు ఉంచి ఈ నిధులు సాధించిందని ఎంపీ తెలిపారు. పట్టణాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి ఫలితంగానే వరంగల్‌కు ఈ స్థాయి నిధులు లభించాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 50 శాతం నిధులు సమకూర్చనున్నాయని, మిగతా భాగం హడ్కో రుణాల ద్వారా సమీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పనులు పూర్తయిన తర్వాత వరంగల్ ఆధునిక నగరంగా రూపుదిద్దుకోనుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.