వరంగల్: చదువులో ప్రతిభ ఉన్నా, పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో వరంగల్‌కు చెందిన వాసవి విద్యా సేవా సమితి మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని పీర్వాటె గాయత్రికి సమితి సభ్యులు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
కేవలం ఈ ఏడాదికే పరిమితం కాకుండా, గాయత్రి మెడికల్ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని సమితి ప్రతినిధి తోట వైద్యనాథ్ ప్రకటించారు.
పేదరికంలో ఉన్న మెరిట్ విద్యార్థులను చేయి పట్టి ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమితి సభ్యులందరూ కలిసి విద్యార్థినికి చెక్కును అందజేసి, ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


