HomeWarangal Newsవరంగల్ వెస్ట్‌లో 25 డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం.. పూర్తి జాబితా

వరంగల్ వెస్ట్‌లో 25 డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం.. పూర్తి జాబితా

Published on

spot_img

వరంగల్ వెస్ట్‌లో 25 డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం..:

వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GWMC) పరిధిలోని 25 డివిజన్లకు నూతన డివిజన్ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం :

నూతన డివిజన్ అధ్యక్షుల నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించడం, ప్రజలకు చేరువగా ఉంటూ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం వంటి బాధ్యతలను కొత్త అధ్యక్షులు నిర్వర్తించనున్నారు. నియామకాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని నాయకులు పేర్కొన్నారు.

నియమితులైన డివిజన్ అధ్యక్షులు:

డివిజన్ 5కు సోమ కరుణ శ్రీ, 6కు మహమ్మద్ ఆజం, 7కు పోలు లక్ష్మీనారాయణ, 8కు సీతా శ్యామ్, 9కు భీమా వినయ్, 10కు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, 11కు ఎండీ. సమద్ నియమితులయ్యారు. అలాగే 29కు బొమ్మ సురేష్, 30కు రాజ్ కుమార్, 31కు సత్తు రమేష్, 47కు దొంగల కుమార్, 48కు చందు, 49కు నాగపురి కరణ్, 50కు బషీర్, 51కు కరీం, 52కు తడుక సుమన్, 53కు ఎర్ర మహేందర్, 54కు సుమన్, 57కు అశోక్ రెడ్డి, 58కు తాళ్లపెల్లి సుధాకర్, 59కు దీపక్ రెడ్డి, 60కు బుస్స నవీన్, 61కు అర్కవత్ లక్ష్మణ్ నాయక్, 62కు పాలడుగుల ఆంజనేయులు, 63కు విజయశ్రీ రజాలి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అభినందనలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు:

నూతనంగా నియమితులైన డివిజన్ అధ్యక్షులకు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles