వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ, గౌరవ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు తన ఉదారతను చాటుకున్నారు.
7వ డివిజన్ పరిధిలోని ప్రముఖ పెద్ద కోవెల
దేవాలయానికి ఎమ్మెల్యే గారి స్వంత ఆర్థిక సహకారంతో అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌ను సమకూర్చడం జరిగింది. దేవాలయంలో జరిగే నిత్య పూజలు, భజనలు మరియు విశేష పర్వదినాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ సౌకర్యాన్ని కల్పించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి సొంత నిధులతో ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పురోహితులు మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న చొరవను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్, స్థానిక నాయకులు మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


