HomeWarangal Newsమంత్రి కోమటిరెడ్డి‌ను కలిసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి‌ను కలిసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Published on

spot_img

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (బుధవారం):

తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ను ఈ రోజు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు, నూతన రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు మంత్రికి సమర్పించారు. నియోజకవర్గంలోని పలు కాలనీలు మరియు ప్రధాన మార్గాలు దెబ్బతిన్న పరిస్థితిలో ఉండటంతో ప్రజలకు రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తగిన నిధులు విడుదల చేసి సహకరించాలని వినతి పత్రం అందజేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదనలను శ్రద్ధగా పరిశీలించి, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్ కూడా పాల్గొన్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.