HomePoliticsఅసెంబ్లీలో నాయిని నిప్పులు: "దొంగే దొంగ అన్నట్లుంది ప్రతిపక్షాల తీరు"

అసెంబ్లీలో నాయిని నిప్పులు: “దొంగే దొంగ అన్నట్లుంది ప్రతిపక్షాల తీరు”

Published on

spot_img

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ, ప్రతిపక్ష నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నాయకులు సుమారు రూ. 200 కోట్ల అక్రమ దోపిడీకి పాల్పడ్డారని నాయిని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై వాస్తవాలు బయటకు రావాలంటే CBI లేదా CID తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

“నేను చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను” అని నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్‌కు పంపిస్తున్నట్లు తెలుపుతూ.. ఇదే దమ్ము కేటీఆర్, హరీష్ రావులకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.

హన్మకొండలో నిబంధనలకు విరుద్ధంగా పార్క్ భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, దీనిపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన వారే ఇప్పుడు నీతులు మాట్లాడటం “దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది” అని ఆయన ఎద్దేవా చేశారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.