HomeWarangal Newsవరంగల్‌లో సంచలనం.. 72 గంటల్లోనే యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు..!

వరంగల్‌లో సంచలనం.. 72 గంటల్లోనే యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు..!

Published on

spot_img

వరంగల్‌లో సంచలనం.. 72 గంటల్లోనే యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు..:

వరంగల్: ఎ.జె. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు కేవలం 72 గంటల్లోనే ఛేదించి, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఫోల్డింగ్ కత్తి, రెండు ద్విచక్ర వాహనాలు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పాత కక్షలతో హత్య:

మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి తెలిపిన వివరాల ప్రకారం, జూలై 25న సాయంత్రం ఉర్సుగుట్టలోని సీపీఎం కార్యాలయం సమీపంలో బి.ఆర్. నగర్‌కు చెందిన మాధ అనిల్ (23)పై ప్రధాన నిందితుడు గిరబోయిన మహేందర్ అలియాస్ మహి తన సహచరులతో కలిసి ఫోల్డింగ్ కత్తితో దాడి చేశాడు. గొంతు కోయడంతో పాటు ఛాతిపై తీవ్రంగా పొడవడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు మాధ సాంబరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో 2023 వినాయక చవితి సందర్భంగా డీజే ఏర్పాటు విషయంలో జరిగిన వివాదమే ఈ హత్యకు మూలకారణమని తేలింది. అనంతరం జరిగిన ఘర్షణలో మహేందర్‌పై నమోదైన కేసుకు ప్రతీకారంగా ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు.

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు:

జూలై 28న ఆర్టీఏ జంక్షన్ వద్ద నిర్వహించిన సాధారణ వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో గిరబోయిన మహేందర్, కంప రాజేష్, భూక్య పూర్ణచందర్ అలియాస్ పున్ను, కొండపాక కమలేష్ ఉన్నారు. హింస, రౌడీయిజం, గ్యాంగ్ వైరం వంటి సంఘవ్యతిరేక కార్యకలాపాలపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోందని ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు నవీకరించడంతో పాటు పీడీ చట్టం కింద కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles