హనుమకొండ జిల్లా: వర్ధన్నపేట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో పాలకుర్తి సారంగపాణి చైర్మన్‌గా, నేతావత్ శిభారాణి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యింది.
కాంగ్రెస్ కౌన్సిలర్లు మెజారిటీ సాధించడంతో ఈ రెండు కీలక పదవులు పార్టీకి దక్కాయి. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు నూతన బాధ్యతలు చేపట్టిన నేతలకు అభినందనలు తెలిపారు.


