HomeWarangal Newsభద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

Published on

spot_img

వరంగల్: చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

ఈ మేరకు ఆలయ ఈవో సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, నిత్య అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం, పురవీధుల్లో ఊరేగింపు తదితర ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని కలెక్టర్‌కు వివరించారు.

Latest articles

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

పాలకుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 54 కుటుంబాలకు అండగా ప్రభుత్వం

పాలకుర్తి మండల కేంద్రంలో 54 మంది లబ్ధిదారులకు ₹54 లక్షలకు పైగా విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి: పగిలిన కర్ణభేరి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వార్డెన్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
spot_img

Related Articles

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.