HomeWarangal Newsకాళోజీ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీపై తల్లిదండ్రుల ధర్నా

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీపై తల్లిదండ్రుల ధర్నా

Published on

spot_img

వరంగల్: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల అక్రమాలపై తల్లిదండ్రులు గళమెత్తారు. వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం (KNRUHS) ఎదుట ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ మెడికల్ మేనేజ్‌మెంట్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా అదనపు ఫీజుల పేరిట తల్లిదండ్రులపై భారం వేస్తున్నారని వారు మండిపడ్డారు.

​ లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నప్పటికీ, కాలేజీలలో కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయని డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజీలలో ఇంకా ర్యాగింగ్ భూతం వెంటాడుతోందని, విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్న ర్యాగింగ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని కోరారు.

యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించిన తల్లిదండ్రులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ అధికారులు జోక్యం చేసుకుని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకునే వరకు తమ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles