ఆర్టీసీ జేఏసీ తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పిలుపునివ్వడంతో, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై కొంత ప్రభావం కనిపిస్తోంది.
ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సుల యాజమాన్యాలు ఈ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. అవి యథావిధిగా నడుస్తుండటంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించింది.
విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మరియు నడుస్తున్న అద్దె బస్సులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.


