వరంగల్: సమ్మర్ హాలిడేస్‌లో క్రికెట్ నేర్చుకోవాలనుకునే ఉమ్మడి జిల్లా యువ క్రీడాకారులకు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. HCA సహకారంతో నెల రోజుల పాటు నిర్వహించే ‘ఉచిత వేసవి క్రికెట్ క్యాంప్’ రేపటి నుంచే ప్రారంభం కానుంది.
ఈ నెల 9 నుంచి జూన్ 9 వరకు (నెల రోజుల పాటు) వరంగల్, ములుగు, జనగామ, నర్సంపేట సహా ఉమ్మడి జిల్లాలోని 8 ప్రధాన కేంద్రాల్లో ఈ శిక్షణ ఉంటుంది.14, 16, 19 మరియు 23 ఏళ్ల లోపు వయసున్న బాలబాలికలు ఈ శిక్షణకు అర్హులు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన వేదిక కల్పించడమే లక్ష్యంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల యువత ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.


