HomeWarangal Newsలిఫ్ట్ సాకుతో అలాంటి పని..కలెక్టరేట్ లో అటెండర్ ను చెప్పు తో కొట్టిన మహిళ..!

లిఫ్ట్ సాకుతో అలాంటి పని..కలెక్టరేట్ లో అటెండర్ ను చెప్పు తో కొట్టిన మహిళ..!

Published on

spot_img

లిఫ్ట్ సాకుతో అలాంటి పని..కలెక్టరేట్ లో అటెండర్ ను చెప్పు తో కొట్టిన మహిళ :

మెహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం సమయంలో చోటు చేసుకోవడం కలకలం రేపింది.

అందుతున్న వివరాల ప్రకారం కలెక్టరేట్ లో.. ఏవో కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న మురళి పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తన భూమి నష్టపరిహారానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ కి వచ్చిన సమయంలో మురళీ పరిచయమయ్యాడు అని..తన పని త్వరగా పూర్తి చేస్తానంటూ నమ్మకం కల్పించాడని బాధితురాలు తెలిపింది. అనంతరం లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ పై తీసుకెళ్లి గ్రామ శివారులో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది.

ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ ఇంటికి వెళ్లిన తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆమెను కాపాడగా జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నేరుగా కలెక్టరేట్ కి చేరుకున్నారు.

గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలో ఉన్న మురళిని నిలదీసి చెప్పులతో కొట్టారు. అనంతరం అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మురళిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు నిజమైతే ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles