HomeWarangal Newsమహిళల సాధికారతకు సమగ్ర చర్యలు అవసరం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

మహిళల సాధికారతకు సమగ్ర చర్యలు అవసరం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

హైదరాబాద్ | తేది: 13-04-2026

మహిళల సాధికారతకు సీఎస్‌ఆర్ నిధులు పెంచాలి

బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో నిర్వహించిన మహిళల సాధికారతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య పాల్గొన్నారు.

ఈ మేరకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చర్యలపై నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు తన ప్రజెంటేషన్ ఇచ్చారు.

Dr Kadiyam Kavya

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలను ఆర్థిక, సామాజిక రంగాల్లో బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, మహిళా సంఘాల బలోపేతం చేస్తుందన్నారు.

పలు పెద్ద పెద్ద సంస్థల్లో కూడా మహిళలపై వేధింపుల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, మహిళల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను మరింతగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

Warangal MP Dr Kadiyam Kavya

ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, ఎన్‌బీసీసీ వంటి సంస్థలు అలాగే థర్మల్ పవర్, మినరల్ రంగాలకు చెందిన సంస్థలు తమ సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో మహిళల సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మహిళల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే దేశ, రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ గారు చెప్పినట్లు మహిళల అభ్యున్నతితోనే దేశ అభివృద్ధి సాధ్యమని డా. కావ్య పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం మరింతగా నిధులు వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కొన్ని పెద్ద సంస్థలు తగిన సీఎస్‌ఆర్ నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో ఆయా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి మరింతగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పలువురు పార్లమెంట్ సభ్యులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని మహిళల సాధికారతకు సంబంధించి పలు సూచనలు, అభిప్రాయాలు వెల్లడించారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.