HomeWarangal Newsరౌడీషీటర్లపై ఉక్కుపాదం.. కఠిన చర్యలకు వరంగల్ సీపీ ఆదేశాలు

రౌడీషీటర్లపై ఉక్కుపాదం.. కఠిన చర్యలకు వరంగల్ సీపీ ఆదేశాలు

Published on

spot_img

రౌడీషీటర్లపై ఉక్కుపాదం.. కఠిన చర్యలకు వరంగల్ సీపీ ఆదేశాలు:

వరంగల్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వరంగల్ సీపీ ఆదేశాలు మరింత కఠినంగా మారాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వరంగల్ సీపీ ఆదేశాలు పోలీస్ అధికారులకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శాంతిభద్రతల పరిరక్షణ పై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు నిర్వహించే కౌన్సిలింగ్ కి శాతం 100 హాజరు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి నెల స్టేషన్ అధికారుల వ్యక్తిగతంగా రౌడీషీటర్ల ఇళ్లలను సందర్శించే వారి ప్రవర్తన కదలికలపై సమాచారం సేకరించాలని తెలిపారు.

రాత్రి సమయాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే కేసులు నమోదు చేయాలని సూచించారు. అలాగే రాత్రివేళ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్లపై జన్మదిన వేడుకలు నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో పని చేసే ఇతర ప్రాంతాల వ్యక్తుల వివరాలు హాస్టల్లో నిర్వహణ సమాచారం స్థానిక పోలీసులు సేకరించాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి ఉదయం 9 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేరస్తుల అరెస్టుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పై అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు.

ప్రశ్న: వరంగల్ సీపీ ఏ ఆదేశాలు ఇచ్చారు?
సమాధానం: వరంగల్ సీపీ రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కౌన్సిలింగ్ నిర్వహించాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles