మహిళా భద్రతపై గోడపత్రిక ఆవిష్కరించిన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్:
హనుమకొండలో మహిళల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మరో ముందడుగు పడింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతకు సంబంధించిన సందేశాలతో రూపొందించిన గోడ పత్రికను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. “మహిళల రక్షణ కోసం భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరిగే వేధింపులు, నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని తెలిపారు. గోడ పత్రిక ద్వారా మహిళా హక్కులు, భద్రతా చర్యలు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ వివరాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యం అన్నారు.
పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేస్తే మహిళలకు మరింత భద్రత కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలు, షీ టీమ్స్ సమర్థంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ Dara Kavitha, అదనపు డీసీపీ Ravi తదితర అధికారులు పాల్గొన్నారు. మహిళా భద్రతపై ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


