TG RTC కండక్టర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అధికారిక ప్రక్రియ పూర్తయ్యాక తెలంగాణ ఆర్టీసీ (TG RTC) త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక?
ఈ కండక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పదో తరగతి (టెన్త్) లో సాధించిన మార్కుల ఆధారంగానే చేపట్టనున్నట్లు సమాచారం. అయితే, ఈ ఎంపిక విధానంలో ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులలో కొందరికి మార్కుల విధానం, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్ల విధానం అమల్లో ఉండటమే దీనికి కారణం.
మీ బిజినెస్‌ను వేల మందికి చేరవేయండి – FREE LISTING చేయండి
ఎంపిక ప్రక్రియపై అభ్యర్థుల్లో ఆసక్తి
TG RTC కండక్టర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఎంపిక విధానం, అర్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తు తేదీలపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ఎస్ఎస్సీ బోర్డుకు ఆర్టీసీ లేఖ
ఈ గ్రేడింగ్ మరియు మార్కుల వ్యత్యాసాన్ని అధిగమించడానికి ఆర్టీసీ యాజమాన్యం ఎస్ఎస్సీ బోర్డుకు కీలక లేఖ రాసింది. పదో తరగతిలోని గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా (Percentage) ఎలా లెక్కించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియపై స్పష్టత వచ్చిన వెంటనే కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.
TG RTC కండక్టర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు తేదీలు, అర్హతలు, ఎంపిక విధానం, వయోపరిమితి వంటి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
FAQ’s
TG RTC కండక్టర్ పోస్టుల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
ప్రభుత్వ అనుమతి లభించింది. ఎంపిక విధానంపై స్పష్టత వచ్చిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
TG RTC కండక్టర్ పోస్టులకు ఎంపిక ఎలా ఉంటుంది?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పదో తరగతి మార్కులు లేదా గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా మార్చిన ఆధారంపై ఎంపిక చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో వెల్లడవుతాయి.
Read Warangal News and Latest Politics News and Real EstateALSO READ….
మైనారిటీ విద్యాసంస్థల్లో ఉద్యోగాల జాతర: బోధన, బోధనేతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
RAILWAY TECHNICIAN NOTIFICATION 2026: రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు – జూన్ 30 నుంచి దరఖాస్తులు
MPDO NOTIFICATION 2026 TELANGANA: తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీ.. జిల్లాల వారీగా వివరాలు వెల్లడి..!
తెలంగాణలో త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల జాతర: 15,982 పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం
టెక్స్టైల్ పార్కులో కొలువుల మేళా: 1800 కుట్టు శిక్షణ పోస్టుల భర్తీ
తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ త్వరలో


