రాహుల్ గాంధీ అరెస్ట్‌పై హనుమకొండలో కాంగ్రెస్ ఆందోళన
హనుమకొండ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ నేతలు శ్రేణులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, DCC అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు బిగ్గరగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲RELATED ARTICLES…..
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
డీసీసీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ గాంధీ పర్యటన: బీజేపీ నేత రావు పద్మ విమర్శ
హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్ వీక్షించేందుకు రాహుల్ గాంధీ..


