వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ హద్దుల్లో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత స్వయంగా రంగానికీ దిగి ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
స్థానిక ప్రజల భద్రత, అక్రమ కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ పరిధికి చెందిన సీఐలు, ఎస్ఐలతో సహా సుమారు 130 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకా చదవండి: వరంగల్ పోలీస్ కంట్రోల్ రూంకు సీపీ శ్వేత ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు!
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వివరాలు:
కాలనీలోని ప్రతీ ఇల్లు, ఆవరణలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు భారీగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు ₹12,000 విలువైన అక్రమ విదేశీ/దేశీ మద్యాన్ని సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని 43 టూ-వీలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు లేని 14 గూడ్స్ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సరైన వివరాలు లేని 4 ఫోర్ వీలర్ కార్లను సీజ్ చేశారు.
ఇంకా చదవండి: సైబర్ నేరాలపై వరంగల్ పోలీసుల ఫుల్ ఫోకస్.. సీపీ శ్వేత కీలక ఆదేశాలు..!
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ.. సస్పెక్టెడ్ వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెంచేందుకే ఈ కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు.
వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఇళ్ళు అద్దెకు ఇచ్చే ముందు వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కాలనీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ వ్యాపారాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇంకా చదవండి: వరంగల్: భద్రకాళి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన వరంగల్ నూతన సీపీ శ్వేత
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲FAQ’s
మిల్స్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వహించారు?
స్థానిక ప్రజల భద్రతను పెంచడం, అనుమానాస్పద వ్యక్తులు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెంచడం కోసం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
కార్డన్ సెర్చ్‌లో ఎంతమంది పోలీసులు పాల్గొన్నారు?
సెంట్రల్ జోన్ పరిధికి చెందిన సీఐలు, ఎస్ఐలతో కలిపి సుమారు 130 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో ఏం స్వాధీనం చేసుకున్నారు?
సుమారు రూ.12,000 విలువైన మద్యం, పత్రాలు లేని 43 టూ-వీలర్లు, వివరాలు లేని 14 గూడ్స్ ఆటోలు, 4 ఫోర్ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు.


