రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇప్పుడు వాట్సప్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
విద్యార్థులు ముందుగా 8096958096 అనే వాట్సప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. వెంటనే Welcome to MeeSeva అనే మెసేజ్ వస్తుంది. అనంతరం “SSC Hall Ticket March-2026” అని పంపితే ఒక లింక్ అందుతుంది.
ఆ లింక్‌ను ఓపెన్ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరు ఎంపిక చేసి, విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తరువాత దాన్ని ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో ప్రింట్ తీసుకోవచ్చు.
అలాగే ఈ నెల 5వ తేదీ నుంచి పాఠశాలల లాగిన్‌లో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, వాటిని హెడ్మాస్టర్లు లేదా ప్రిన్సిపాళ్ల ద్వారా కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇక ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారని, దాని ద్వారా విద్యార్థులు తమ ఇల్లు నుంచి పరీక్షా కేంద్రం వరకు దూరం, ప్రయాణ సమయం, చిరునామా వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల హెడ్మాస్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.


