HomeWarangal Newsహన్మకొండలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఈ..!

హన్మకొండలో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఈ..!

Published on

spot_img

డీఈ శ్రీకాంత్ ఏసీబీ దాడి ఘటన హనుమకొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ అధికారిక పనుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

భవాని నగర్ లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు:

సోమవారం హనుమకొండలోని భవాని నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీకాంత్ నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో డిఈ లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు. ఘటనా స్థలంలోనే నగదును స్వాధీనం చేసుకొని పలు ఆధారాలను సేకరించారు.

అధికారిక పనుల కోసం డిమాండ్ :

సంబంధిత వ్యక్తి పనులను పూర్తి చేయడానికి డిఈ శ్రీకాంత్ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఈ దాడి నిర్వహించినట్లు తెలిసింది. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కేసు నమోదు విచారణ కొనసాగింపు :

ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లంచం వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ శాఖలలో అవినీతిని సహించబోమని.. ప్రజలు ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి అని అధికారులు సూచరించారు.

ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్

ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, మౌలిక వసతులపై అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచించారు.

వరంగల్ నగరంలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత: పైప్‌లైన్ మరమ్మతుల వివరాలు

మడికొండ రైల్వే ట్రాక్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత. ప్రభావిత ప్రాంతాల వివరాలు, అధికారుల సూచనలు ఇక్కడ చూడండి.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.