వేముల శ్రీనివాస్ కాంప్లెక్స్ సీజ్ ఘటన హనుమకొండలో చర్చనీయాంశంగా మారింది. భారీ బకాయిల వసూళ్లపై బల్దియా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌కు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను అధికారులు సీజ్ చేశారు.
మునిసిపల్ పన్నులు, ఇతర చెల్లింపుల రూపంలో సుమారు రూ.3 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వేముల శ్రీనివాస్ కాంప్లెక్స్ సీజ్ ప్రక్రియ
పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం బల్దియా రెవెన్యూ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోలీసుల సహకారంతో కాంప్లెక్స్ వద్దకు చేరుకొని సీజ్ ప్రక్రియ నిర్వహించారు.
భవనంలోని అన్ని వ్యాపార సముదాయాల షాపులకు తాళాలు వేసి ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అక్రమ బకాయిల వసూళ్ల విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంసంగా మారింది. బకాయిల చెల్లింపులు నిర్లక్ష్యం వహించే వారిపై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కఠిన చర్యలు కొనసాగుతాయని బల్దియా అధికారులు హెచ్చరించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


