HomePoliticsబిజెపి విధానాలపై నన్నపనేని నరేందర్ వినూత్న నిరసన: వరంగల్ చౌరస్తాలో ఉద్రిక్తత

బిజెపి విధానాలపై నన్నపనేని నరేందర్ వినూత్న నిరసన: వరంగల్ చౌరస్తాలో ఉద్రిక్తత

Published on

spot_img

వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు.

వరంగల్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నాయకుల ఆగడాలను నిరసిస్తూ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) శ్రేణులు వరంగల్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా శ్రీరాముని విగ్రహానికి పూజలు నిర్వహించి, వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నన్నపనేని నరేందర్ బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఇవే:

2014లో ‘చాయ్ వాలా’ అని నమ్మించి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.

‘బేటీ బచావో’ నినాదం కేవలం మాటలకే పరిమితమైంది. బండి సంజయ్ కుమారుడి వ్యవహారమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

అన్యాయం జరిగిందని బాధితులు మొరపెట్టుకుంటే, వారిని బెదిరించడం, ఉల్టా కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. నిందితుడు భగీరథ్ ‘ప్రజల మధ్యనే ఉన్నాను’ అని చెబుతుంటే, పోలీసులు ‘దొరకడం లేదు’ అనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

దేశంలో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని, నీట్ పరీక్ష రద్దుకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో 65 సార్లు వివిధ పరీక్షలు లీక్ అయ్యాయని, ఇది వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

బండి సంజయ్ వరంగల్‌కు వచ్చి బురద చల్లి పోయారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. అబద్ధాలను నిజం చేయడంలో బిజెపి సిద్ధహస్తురాలు.”— నన్నపనేని నరేందర్.

దక్షిణాదిపై వివక్ష

ఉత్తరాదిన ప్రజాధనాన్ని దోచుకుంటూ, దక్షిణాది రాష్ట్రాలను బిజెపి అవహేళన చేస్తోందని నరేందర్ ఆరోపించారు.బీసీల పట్ల స్థానిక బిజెపి నాయకులు చిన్నచూపు చూస్తున్నారని, సామాజిక న్యాయం కోసం తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా రాజకీయ వేడిని రగిల్చింది.

FAQ’s

ప్రశ్న: వరంగల్‌లో ఎందుకు నిరసన జరిగింది?
సమాధానం: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన చేపట్టింది.

ప్రశ్న: నన్నపనేని నరేందర్ ఏమన్నారు?
సమాధానం: బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

బీసీ మంత్రిని బర్తరఫ్ చేయడం అన్యాయం: వేణుగోపాల్ గౌడ్

బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం తీవ్ర అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ పేర్కొన్నారు.