ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్ఎల్ఎన్ఏటీ) ఈనెల 29న నిర్వహించనున్నట్లు వయోజన విద్య ఉపసంచాలకుడు తుమ్మ రమేశ్ రెడ్డి తెలిపారు.
🕙 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది.
📌 ఈ సమయంలో ఏ 2 గంటల్లోనైనా పరీక్ష రాయవచ్చు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి NIOS సర్టిఫికెట్ అందజేస్తారు.
📊 ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 82,499 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
📚 అక్షరాస్యత పెంపు కోసం ఉల్లాస్ కార్యక్రమం కింద శిక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


