కార్మికుల హక్కుల పరిరక్షణపై వినయ్ భాస్కర్ 4 కీలక వ్యాఖ్యలు
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం చైతన్యం అవసరమని ప్రభుత్వం మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి ప్రెస్ స్ట్రెస్ కాంక్రీట్ వర్క్స్ కంపెనీ కార్మికులతో ఆదివారం వడ్డేపల్లిలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు.
కార్మిక ఉద్యోగ చైతన్య మాసోత్సవాల సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత, హక్కుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాస్యం వినయ్ భాస్కర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగాలి
4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు కార్మికులు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఎల్ పి సి కంపెనీ నుంచి తొలగించబడిన కార్మికుల అంశంపై స్పందించిన ఆయన.. యాజమాన్యంతో నేరుగా మాట్లాడి వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు, కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ జోక్యంతో యాజమాన్యం సానుకూలంగా స్పందించి కార్మికులను తిరిగి పనిలోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


