HomeWarangal Newsఇందిరానగర్‌లో అవెన్యూ ప్లాంటేషన్.. మొక్కలు నాటిన జిడబ్ల్యూఎంసి కమిషనర్

ఇందిరానగర్‌లో అవెన్యూ ప్లాంటేషన్.. మొక్కలు నాటిన జిడబ్ల్యూఎంసి కమిషనర్

Published on

spot_img

వరంగల్: నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ అవెన్యూ ప్లాంటేషన్‌ను ప్రోత్సహించాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూచించారు.

​జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 59వ డివిజన్, ఇందిరానగర్ కాలనీలో నిర్వహించిన ప్రత్యేక అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కాలనీ ప్రతినిధులతో కలిసి ఆయన కాలనీ వీధుల్లో మొక్కలు నాటారు.

​ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు అవెన్యూ ప్లాంటేషన్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లోనూ రోడ్లకు ఇరువైపులా విస్తృతంగా మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని క్రమం తప్పకుండా నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజలు మరియు కాలనీ కమిటీలపై ఉందన్నారు.

​వరంగల్ నగరాన్ని స్వచ్ఛమైన, పచ్చని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles